పూర్తి ఆరోగ్యంగా బ్రిటన్ ప్రధాని.. అధికారిక విధుల్లోకి జాన్సన్
- నేటి నుంచి అధికారిక విధులు
- నేడు ‘వార్ కేబినెట్’తో సమావేశం
- 15 రోజుల తర్వాత డౌనింగ్ స్ట్రీట్‌కు జాన్సన్
కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రిలో చేరి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారిక విధుల్లో చేరారు. 15 రోజుల తర్వాత నిన్న డౌనింగ్ స్ట్రీట్‌లోని తన కార్యాలయానికి చేరుకున్న జాన్సన్ నేటి నుంచి అధికారికంగా విధుల్లో పాల్గొననున్నారు. నేడు ఆయన కరోనా వైరస్ ‘వార్ కేబినెట్’తో సమావేశం కానున్నారు.
ఇప్పటి వరకు ప్రధాని స్థానంలో విధులు నిర్వర్తించిన విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ మాట్లాడుతూ.. ప్రధాని తిరిగి విధులకు సిద్ధమైనట్టు చెప్పారు. ఈ నెల 5న లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరిన ప్రధాని జాన్సన్.. వారం రోజులపాటు ఆసుపత్రిలోనే గడిపారు. అందులో మూడు రోజులు ఇంటెన్సివ్ కేర్‌లోనే ఉన్నారు. ఏప్రిల్ 12న జాన్సన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ‘వార్ కేబినెట్’తో నేడు జరగనున్న సమావేశంలో సామాజిక దూరం నిబంధనలను సడలించాలా? వద్దా? అనే దానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.