అర్ధరాత్రి వేళ చార్మినార్‌కు కేంద్ర బృందం.. పోలీసు సేవలపై సంతృప్తి
- నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించిన బృందం
- కంటైన్మెంట్, క్వారంటైన్ కేంద్రాల సందర్శన
- నేడు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం పరిశీలన
రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన కోసం శనివారం హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం శనివారం అర్ధరాత్రి చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించింది. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో అక్కడ లాక్డౌన్ ఎలా అమలవుతున్నదీ పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి అరుణ్ భరోకా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించింది. రైతు బజార్లు, క్వారంటైన్ కేంద్రాలు, కంటైన్మెంట్ జోన్లను పరిశీలించింది. లాక్డౌన్ వేళ పోలీసులు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసింది.
అంతకుముందు డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయింది. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యల గురించి ఆరా తీసిన బృందం.. నిత్యావసరాల పంపిణీ, కంటైన్మెంట్ జోన్ల కట్టడి, కరోనాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాల వద్ద బందోబస్తుకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత మెహదీపట్నంలోని రైతు బజార్, అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ ఆసుపత్రులను సందర్శించింది. నేచర్ క్యూర్ ఆసుపత్రిలోని శాంపిల్స్ టెస్టింగ్ ల్యాబ్‌ను తనిఖీ చేసి వైద్య సిబ్బందిని అభినందించింది. నేడు జీహెచ్ఎంసీ కంట్రోలు రూమును పరిశీలించనుంది.