కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ల జైలు... తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఇటీవల కరోనాతో మరణించిన చెన్నై డాక్టర్
- అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు
- అడ్డుకున్నా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఇకపై శిక్షార్హమైన నేరం
కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రజల నుంచి తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకుంటే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కరోనా మృతులకు కూడా అందరిలాగానే గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు దక్కాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల చెన్నైలో సైమన్ హెర్క్యులస్ అనే డాక్టర్ కరోనాతో మృతి చెందగా, అంత్యక్రియలకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్పందన రావడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకోవడం కానీ, అడ్డుకునేందుకు ప్రయత్నించడం కానీ ఇకపై శిక్షార్హమైన నేరం కానుంది.