వలస కార్మికులను తీసుకెళ్లండి... 6 రాష్ట్రాలను కోరిన మహారాష్ట్ర సర్కారు
- రాష్ట్రాల సరిహద్దుల వరకు కార్మికులను తామే తీసుకువస్తామని ప్రతిపాదన
- బదులుగా మహారాష్ట్ర కార్మికులను అదేవిధంగా తీసుకురావాలని సూచన
- లాక్ డౌన్ తో అనేక రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు
లాక్ డౌన్ కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలోనూ లక్షల సంఖ్యలో వలసదారులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో 3.5 లక్షల మంది వలసకార్మికులను తీసుకెళ్లాలంటూ మహారాష్ట్ర సర్కారు 6 రాష్ట్రాలను కోరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్ గఢ్ లు వెంటనే స్పందించాలని మహారాష్ట్ర సీఎస్ అజయ్ మెహతా పేర్కొన్నారు.
ఆయా రాష్ట్రాల సరిహద్దుల వరకు వలస కార్మికులను తామే తీసుకువచ్చి అప్పగిస్తామని తెలిపారు. అందుకు బదులుగా, ఆయా రాష్ట్రాల్లో ఉన్న మహారాష్ట్ర కార్మికులను సరిహద్దులకు వరకు తీసుకురావాలని రాష్ట్రాలకు సూచించారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఇదే తరహాలో స్పందించాయి. తమ రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ కార్మికులను వారి స్వస్థలాలకు పంపించి వేశాయి.