లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిని దూరం నుంచే పట్టుకునేందుకు చండీగఢ్ పోలీసుల కొత్త ఐడియా

  • చండీగఢ్ లో వినియోగిస్తున్న పోలీసులు
  • వీడియో పోస్టు చేసిన చండీగఢ్ డీజీపీ
  • సెల్ఫ్ క్వారంటైన్ కు నిరాకరించిన వ్యక్తిని పరికరంతో పట్టేసిన పోలీసు
కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ విధించినా, కొందరు నియమావళి పాటించకుండా ఉల్లంఘించడం అనేక ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చినవారికి కరోనా సోకివుంటే వాళ్లను పట్టుకునే క్రమంలో పోలీసులకు కూడా సోకే ప్రమాదం ఉంది. అందుకోసం చండీగఢ్ పోలీసులు సరికొత్త ఆవిష్కరణ చేశారు.

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని దూరం నుంచే పట్టుకునేందుకు వినూత్న పరికరం రూపొందించారు. ఇది రెండు మీటర్ల పొడవుతో పాములు పట్టే రాడ్ తరహాలో ఉంటుంది. దాని చివరన ఓ బ్రేక్ వంటి ఏర్పాటు ఉంటుంది. దాంట్లో ఓ వ్యక్తిని బంధించి లాక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను చండీగఢ్ డీజీపీ సంజయ్ బనివాల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. సెల్ఫ్ క్వారంటైన్ కు నిరాకరించిన ఓ వ్యక్తిని పోలీసు ఆ పరికరంతో ఎలా ట్రాప్ చేశాడో వీడియోలో చూడొచ్చు.


More Telugu News