బ్రిటీష్-నిజాం కాలంలోనూ హైదరాబాద్ లో లాక్ డౌన్... ఎందుకంటే?
- అప్పట్లో ప్రబలిన కలరా, ప్లేగు
- లక్షల్లో మరణించిన ప్రజలు
- వేతనంతో కూడిన సెలవు అమలు చేసిన పాలకులు
ప్రస్తుతం కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటిప్రజలకు ఈ లాక్ డౌన్ ఓ కొత్త అనుభవం. అయితే, నాడు బ్రిటీష్ పాలన సమయంలో హైదరాబాద్ సంస్థానంలో కూడా ఓసారి లాక్ డౌన్ విధించారు. అప్పట్లో కలరా, ప్లేగు వంటి మహమ్మారి వ్యాధులు లక్షల సంఖ్యలో ప్రజలను కబళించివేశాయి. దాంతో అన్నింటిని మూసేశారు. ఇప్పటి లాక్ డౌన్ తో పోల్చితే నాడు విధించిన లాక్ డౌన్ ఎంతో విభిన్నమైనది. బ్రిటీష్ అధికారులు లాక్ డౌన్ అనే పదాన్ని ఉపయోగించలేదు కానీ, 'వేతనంతో కూడిన సెలవు'గా పిలిచేవారు.
కలరా, ప్లేగులను నివారించడానికి, ప్రజల నైతిక స్థైర్యం, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ 'ప్రత్యేక సెలవు' ఎంతో ఉపయోగపడుతుందని బ్రిటీష్ పాలకులు భావించారు. బండ్లు, రైళ్లు, ఓడలను నిలిపివేశారు. బ్రిటీష్ పాలకులతో పాటు హైదరాబాద్ సంస్థానం కూడా సమాంతరంగా లాక్ డౌన్ తరహాలో ఆంక్షలు విధించింది. ఇప్పట్లాగానే కంటైన్ మెంట్ జోన్లు, ఐసోలేషన్ ఆసుపత్రులు, స్పెషల్ పాసులు తదితర ఏర్పాట్లు చేసింది. వలస కార్మికుల సమస్య అప్పుడు కూడా ఉత్పన్నమైంది. వారికి 32 రోజుల కూలీని ముందుగానే చెల్లించారు. ప్రస్తుతం వలస కార్మికులను ఎక్కడివాళ్లను అక్కడే ఉంచేస్తుండగా, నాడు 500 మందిని ఓ బృందంగా చేసి వారి స్వస్థలాలకు తరలించారు.