కుక్క పని కుక్క ..గాడిద పని గాడిదే చేయాలి: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి
- సినిమాల్లో నటించడం కొనసాగించవచ్చుగా? అనే ప్రశ్నకు కీరవాణి ఆసక్తికర సమాధానం
- మనకు సంబంధించని, చేతకాని పని చేయకూడదు
- ‘యాక్టింగ్’ అనేది నా స్వధర్మం కాదు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి తనకు సంబంధించి అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. సంగీత దర్శకుడిగానే గాక, ఓ గీత రచయిత, గాయకుడు ఆయనలో ఉన్నారని, ఓ సినిమాలో కూడా నటించారంటూ ఓ ఇంటర్వ్యూలో కీరవాణిని వ్యాఖ్యాత ప్రశంసించారు.
సినిమాల్లో నటించడం కొనసాగించవచ్చుగా? అంటూ ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు కీరవాణి స్పందిస్తూ, కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలని, అలాగే, మనకు సంబంధించని, చేతకాని పని మనం చేయకూడదని అన్నారు. ‘యాక్టింగ్’ అనేది ‘నా స్వధర్మం కాదు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘కరోనా’ అంశంపై ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ కట్టడి నేపథ్యంలో ఎవరు ఏ సూచన చేసినా, ఏ కథ చెప్పినా, ఏ ఉదాహరణ చెప్పినా వాటి సారాంశం ఒక్కటేనని, ‘ఇంట్లో ఉండండి.. బయటకు వెళ్లొద్దు’ అని అన్నారు.