కరోనా ఆసుపత్రి కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇవ్వాలన్న విజయసాయి... లోటస్ పాండ్ భవనానికి ఏమైందన్న బుద్ధా!
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఖాళీగా పడుందన్న విజయసాయి
- తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలని చంద్రబాబుకు సూచన
- జగన్ ఆ భవనాలు ఇస్తే వైకాపా ఆత్మకు ఊరట లభిస్తుందన్న బుద్ధా
ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఖాళీగా పడుందని, ఆ భవనాన్ని కరోనా హాస్పిటల్ గా ఉపయోగించుకునేందుకు ఇస్తే చంద్రబాబు తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నట్టు అవుతుందని విజయసాయి తాజాగా ట్వీట్ చేశారు. ఇది క్లిష్ట సమయం అని, ఇలాంటి సమయంలో పెద్ద మనసు కనబర్చాలని, తద్వారా పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మకూడా శాంతిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ కు బుద్ధా వెంకన్న వెంటనే కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న లోటస్ పాండ్ ఇంద్రభవనం, బెంగళూరులో ఖాళీగా ఉన్న యలహంక రాజప్రసాదం కరోనా ఆసుపత్రికి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారంటూ బుద్ధా దీటుగా బదులిచ్చారు. పైగా ఇవి ఆధునిక సౌకర్యాలు ఉన్న భవనాలు కావడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలవుతుందని, ఇది ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయం అని తన ట్వీట్ లో వివరించారు. అంతేకాదు, వైఎస్ జగన్ గారు పెద్ద మనసు చేసుకుని ఆ భవనాలు ఇస్తే ప్రజాధనం కొట్టేసి నరకానికి వెళ్లిన వైకాపా ఆత్మకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుందని విజయసాయిరెడ్డికి సూచించారు.