మే 3 నాటికి ఏపీలో కరోనా కేసులు 2,000కి పెరిగే అవకాశం: యనమల
- కేంద్ర అధికారుల బృందం రాష్ట్రానికి వస్తోంది
- ఆ బృందాన్ని కలుస్తాం
- వైసీపీ ప్రభుత్వం కరోనాను తేలిగ్గా తీసుకుందని ఫిర్యాదు చేస్తాం
- వైసీపీ నేతలే కరోనా వ్యాప్తి ఇంతగా జరగడానికి కారకులయ్యారు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజు భారీగా పెరిగిపోతోన్న కరోనా కేసులపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇలాగే కరోనా కేసులు పెరిగితే మే 3 నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,000కు చేరతాయని తెలిపారు. కేంద్ర అధికారుల బృందంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులను పరిశీలించేందుకు రెండు రోజుల్లో ఏపీకి వస్తుందని గుర్తు చేశారు.
తాము కేంద్ర అధికారుల బృందాన్ని కలుస్తామని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వైసీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని వారికి ఫిర్యాదు చేస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు. వైసీపీ నేతలే కరోనా వ్యాప్తి ఇంతగా జరగడానికి కారకులయ్యారని తాము ఫిర్యాదు చేస్తామని అన్నారు. కరోనా కేసులు పెరిగితే ఇన్‌ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనాపై సరైన లెక్కలు చెప్పాలన్నారు.