అత్యంత పాశవికమైన కొరడా దెబ్బల శిక్ష రద్దు: సౌదీ అరేబియా

  • నేరస్థుల పట్ల కర్కశంగా వ్యవహరించే సౌదీ
  • రాజు ఆదేశాల ప్రకారం కొరడా శిక్ష రద్దు
  • వెల్లడించిన సుప్రీంకోర్టు జనరల్ కమిషన్
నేరస్థుల పట్ల అత్యంత పాశవికమైన శిక్షలను అమలు చేసే సౌదీ అరేబియా, ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది విమర్శించే కొరడా దెబ్బల శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో కొరడా దెబ్బలు విధించే శిక్షలకు పాల్పడిన వారికి ఇకపై జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించాలని నిర్ణయించింది.

ఈ మేరకు సుప్రీంకోర్టు జనరల్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిల్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ శిక్షను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని మానవ హక్కుల సంఘాలు స్వాగతించాయి. మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, రహదారులపై రొమాన్స్ చేయడం వంటి నేరాలకు ఇక్కడ బహిరంగ కొరడా దెబ్బల శిక్షలను విధిస్తుంటారు.


More Telugu News