రైళ్లు జారిపోతాయేమోనని తాళాలు వేశారు!
- లాక్ డౌన్ తో నిలిచిన రైళ్లు
- ప్రధాన స్టేషన్లలో పదుల సంఖ్యలో పట్టాలపైనే
- ఎత్తుపల్లాలు ఉన్న చోట్ల బోగీలు కదలకుండా లాక్స్
లాక్ డౌన్ కారణంగా రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో పదులకొద్దీ రైళ్లు పట్టాలపైనే ఉండిపోయాయి. చిన్న చిన్న స్టేషన్లలో సైతం ఖాళీ కనిపిస్తే, అక్కడ రైళ్లను నిలిపివేసి, బోగీలను ఇంజిన్ల నుంచి వేరు చేశారు. ఇక ఇదే సమయంలో ఎత్తు పల్లాలు ఉన్న చోట్ల రైళ్లు కదిలే ప్రమాదం ఉందని భావించిన అధికారులు, పట్టాలతో రైలు కోచ్ లను కలుపుతూ తాళాలు వేశారు.
మరికొన్ని చోట్ల పట్టాలపై లాక్స్ ఉంచారు. ఇవి రైలు బోగీ చక్రాలను అడ్డుకుంటాయని అధికారులు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, కాకినాడ వంటి పలు రైల్వే స్టేషన్లలో ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లు ఇప్పుడు పట్టాలపై నిలిచివున్నాయి.