విమర్శలు వెల్లువెత్తగానే... తాను కామెడీగా మాట్లాడానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ట్రంప్!
- కరోనా అంతానికి క్రిమి సంహారిణులు
- మానవ శరీరంలోకి ఎక్కించాలన్న ట్రంప్
- వ్యంగ్యోక్తిగానే భావించాలని వివరణ
కరోనాను శరీరం నుంచి పారద్రోలాంటే, క్రిమి సంహారక మందులను ఎక్కించాలని వ్యాఖ్యానించి, తీవ్ర విమర్శల పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నిం చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో పెస్టిసైడ్స్ ను మానవ శరీరంలోకి పంపాలని, అల్ట్రా వయోలెట్ రేస్ ను కూడా పంపిస్తే, కరోనా క్రిములు మరణిస్తాయని అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు.
దేశాధ్యక్షుడి స్థాయిలో ఉండి, ఇటువంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. సొంత పార్టీ సభ్యులు సైతం ఆయన వ్యాఖ్యలను ఖండించగా, తాజాగా ట్రంప్ ఈ విషయమై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు కేవలం వ్యంగ్యోక్తులేనని, వాటిని సీరియస్ గా ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించారు. తాను సరదాగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.