మరో 25 రోజుల్లో ఇండియాలో కరోనా అంతమవుతుందంటున్న సింగపూర్ యూనివర్శిటీ!

  • మే 20 నాటికి ఇండియాలో వైరస్ అంతం
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా విశ్లేషణ
  • చాలా దేశాల్లో వైరస్ కనిపించబోదన్న ఎస్యూటీడీ
మరో 25 రోజుల్లో... అంటే, మే 20 నాటికి ఇండియాలో కరోనా మహమ్మారి అంతమవుతుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఎస్యూటీడీ) అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సేకరించిన డేటాను విశ్లేషించిన ఎస్యూటీడీ ఈ విషయమై ఓ ప్రకటన చేసింది. ఇండియాతో పాటు పలు దేశాల్లో ఈ వైరస్ కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించింది.

ఎస్ఐఆర్ (ససెప్టబుల్ ఇన్ఫెక్టెడ్ రికవర్డ్) అంటువ్యాధి నమూనాను విశ్లేషించిందని, వ్యాధి అనుమానితులతో పాటు, కోలుకున్న రోగుల నుంచి నమూనాలు, మహమ్మారి విస్తరించిన తేదీలను పరిశీలించి, ఈ అంచనాకు వచ్చామని పేర్కొంది. కాగా, ఇండియాలో ఇప్పటికే దాదాపు 25 వేల మంది కరోనా బారిన పడగా, సుమారు 800 మంది వరకూ మరణించారన్న సంగతి తెలిసిందే.


More Telugu News