ఒకసారి కరోనా నుంచి కోలుకున్నవారికి మళ్లీ సోకదనడానికి ఆధారాల్లేవు: డబ్ల్యూహెచ్ఓ
- కరోనా వ్యాప్తిపై సభ్య దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ
- కరోనా నుంచి కోలుకున్న వారికి హెల్త్ పాస్ పోర్టులు ఇస్తున్న చిలీ
- ఇమ్యూనిటీ పాస్ పోర్టులు ఇవ్వడం సహేతుకం కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ వ్యాప్తిపై సభ్య దేశాలను హెచ్చరించింది. ఒకసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ సోకదని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని, కరోనా తగ్గిన వ్యక్తుల్లో యాంటీబాడీలు పెంపొంది రెండో పర్యాయం ఇన్ఫెక్షన్ కు తగిన రక్షణ వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పలేమని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు ఇమ్యూనిటీ పాస్ పోర్టులు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్లు ఇవ్వడం వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి హెల్త్ పాస్ పోర్టులు ఇస్తున్నట్టు చిలీ పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాఖ్యలు చేసింది.
కరోనా నయమైన వ్యక్తుల్లో యాంటీబాడీలు ఏర్పడినా, అవి తాత్కాలికమేనని పలు అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. ఇలాంటి ఇమ్యూనిటీ నెలకు మించి ఉండదని, దాంతో మరోసారి వైరస్ బారిన పడేందుకు అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.