ఆన్ లైన్ విచారణ సందర్భంగా సివిల్ దుస్తుల్లో కనిపించిన న్యాయవాది.. జడ్జి ఆగ్రహం!
- లాక్ డౌన్ నేపథ్యంలో న్యాయస్థానాల ఆన్ లైన్ విచారణ
- రాజస్థాన్ హైకోర్టు విచారణలో ఘటన
- ఆగ్రహంతో విచారణ వాయిదా వేసిన జడ్జి
కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించడంతో సుప్రీం కోర్టు సహా అన్ని కోర్టులు ఆన్ లైన్ విచారణ చేపడుతున్నాయి. అయితే రాజస్థాన్ హైకోర్టు ఓ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆన్ లైన్ విచారణ జరుపుతుండగా, న్యాయవాది సాధారణ దుస్తుల్లో దర్శనమివ్వడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ విచారణ అయినా సరే లాయర్ యూనిఫాం ధరించే రావాలని స్పష్టం చేశారు.
అంతేకాదు, ఆ న్యాయవాది నల్లకోటు ధరించి విచారణకు హాజరు కాలేదన్న కారణంతో సదరు విచారణను వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. కిందటి నెలలో ఇలాంటిదే ఓ ఘటన జరగడంతో, రాజస్థాన్ హైకోర్టు అందరు లాయర్లు సరైన యూనిఫాం ధరించాలంటూ నోటీసులు జారీ చేసింది.