జూమ్ యాప్ కు పోటీగా 'మెసెంజర్ రూమ్స్' తీసుకువస్తున్న ఫేస్ బుక్
- లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజాదరణ పొందిన జూమ్ యాప్
- జూమ్ వీడియో కాల్ భద్రతపై సందేహాలు
- సరికొత్త ఫీచర్ తో యూజర్లను ఆకట్టుకోవాలనుకుంటున్న ఫేస్ బుక్
ఇప్పటికే కొన్ని వీడియో కాలింగ్ యాప్ లు చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో 'జూమ్'కు వచ్చినంత పేరు వాటికి రాలేదు. అందుకు కారణం లాక్ డౌన్ పరిస్థితులే. ఒకేసారి పెద్ద సంఖ్యలో వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేసుకునే సదుపాయం ఉండడంతో ఇళ్ల నుంచే వ్యాపార కార్యకలాపాలు, ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి 'జూమ్' ఫేవరెట్ యాప్ అయింది. అయితే దీని భద్రతపై భారీగా సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఇతర సంస్థలు 'జూమ్' కు పోటీగా వీడియో కాలింగ్ యాప్ లు తీసుకువస్తున్నాయి. తాజాగా ఫేస్ బుక్ కూడా 'మెసెంజర్ రూమ్స్' అనే ఫీచర్ ను ప్రవేశపెడుతోంది.
ఫేస్ బుక్ యాప్ లో కానీ, మెసెంజర్ లో కానీ ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ లో 'రూమ్ క్రియేటర్' గా ఒకరు వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే 'కాల్ మేకర్' అన్నమాట. 'కాల్ మేకర్ లేక రూమ్ క్రియేటర్' నిర్ణయంపైనే ఎవరెవరు ఆ కాల్ లో భాగస్వాములవుతారన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్ బుక్ సమాయత్తమవుతోంది.
వర్చువల్ గా ఓ రూమ్ క్రియేట్ చేయడం అంటే ఓ వీడియో కాన్ఫరెన్స్ కాల్ ప్రారంభించడంగా భావించవచ్చు. రూమ్ క్రియేటర్ నుంచి వచ్చిన ఇన్వైట్ ను ఓకే చేస్తే మీరు కూడా ఆ కాన్ఫరెన్స్ లోకి ఎంటరవుతారు. మెసెంజర్ రూమ్స్ ఫీచర్ ను తొలుత కొన్ని దేశాల్లో ఈ వారంలో ప్రవేశపెట్టాలని ఫేస్ బుక్ భావిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తం చేయాలన్నది ఈ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం యోచన. కాగా, వాట్సాప్ రాకతో కళ తప్పిన మెసెంజర్ కు ఈ సరికొత్త ఫీచర్ వన్నెలద్దుతుందని ఫేస్ బుక్ భావిస్తోంది.