ఎన్‌ఐఏ అధికారికి సోకిన కరోనా
- ముంబైలో పని చేస్తున్న ఓ ఏఎస్‌ఐకి సోకిన వైరస్
- ఆయనతో కాంటాక్ట్ అయిన సిబ్బంది స్వీయ నిర్బంధం
- మహారాష్ట్రలో మరో 394 కొత్త కేసులు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి చెందిన ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది. ముంబై ఎన్‌ఐఏ కార్యాలయంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
దాంతో, ఆ ఏఎస్‌ఐతో కాంటాక్ట్ అయిన సిబ్బందిని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది. తగిన నియంత్రణ చర్యలు తీసుకుంటామని చెప్పింది. కాగా, కరోనా కారణంగా మహారాష్ట్రలో శుక్రవారం మరో 18 మంది చనిపోయారు. కొత్తగా 394 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6,817కు పెరిగిందని అధికారులు తెలిపారు.