ఉత్తరాంధ్రకు కూడా పాకిన కరోనా.. శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు నమోదు!

ఉత్తరాంధ్రకు కూడా పాకిన కరోనా.. శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు నమోదు!
  • నిన్నటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదు కాని కేసులు
  • శ్రీకాకుళం జిల్లాలో కరోనా ఎఫెక్ట్
  • తీవ్ర ఆందోళనలో ఉత్తరాంధ్ర వాసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పడగలు విప్పుతోంది. ఊహించని విధంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య వెయ్యి దాటడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు కరోనా రక్కసి ఉత్తరాంధ్రను కూడా తాకింది. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర వాసుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. ఈ కేసుల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,016కి చేరగా... మరణాల సంఖ్య 31గా ఉంది.


More Telugu News