లాక్ డౌన్ లో ఏం చేస్తున్నాడో వీడియో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. కొరటాల శివ విసిరిన ఛాలెంజ్ పూర్తి!

  • 'బీ ఎ రియల్ మ్యాన్' ఛాలెంజ్ విసిరిన కొరటాల శివ
  • మా అమ్మ ఇంకా చిన్న పిల్లల మాదిరే చూస్తోందని నిన్న విజయ్ వ్యాఖ్య
  • అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలని సూచన
సినీ దర్శకుడు కొరటాల శివ విసిరిన 'బీ ఎ రియల్ మ్యాన్' ఛాలెంజ్ పై హీరో విజయ్ దేవరకొండ నిన్న స్పందించిన సంగతి తెలిసిందే. మా మమ్మీ ఇంకా మమ్మల్ని చిన్న పిల్లల్లాగే చూస్తోందని, రియల్ మ్యాన్ గా చూడటం లేదని ఈ సందర్భంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. లాక్ డౌన్ సమయంలో తాను ఏ విధంగా గడుపుతున్నాడో వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఈరోజు ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

విజయ్ పోస్ట్ చేసిన వీడియో ఒక హెచ్చరికతో ప్రారంభవుతుంది. ఇంట్లో ఇలాంటి పనులు చేయొద్దని... తల్లిదండ్రుల నుంచి కష్టాలు తప్పవని విజయ్ హెచ్చరించాడు. నిద్ర లేచిన తర్వాత బెడ్ సర్దడం, బాటిల్స్ క్లీన్ చేయడం, మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం, వీడియో గేమ్ ఆడటం, వార్డ్ రోబ్ క్లీన్ చేయడం వంటివన్నీ వీడియోలో ఉన్నాయి.

వీడియో చివర్లో... ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులతో ఉన్నప్పుడు సంక్షోభం అనిపించదని చెప్పాడు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఒకరికొకరు సహాయసహకారాలను అందించుకోవాలని సూచించాడు. అలాగే ఈ చాలెంజ్ ను మలయాళ హీరో దుల్ఖర్ సల్మాన్ కి విసిరాడు. వీడియో ఇదిగో చూడండి.


More Telugu News