దేశంలో ఎటువంటి ఎన్నికలు ఇప్పుడు వద్దు: కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిల్
- రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు సూచనలు చేయాలి
- ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి ఆదేశాలివ్వాలి
- సామాజిక దూరం అవసరం
- రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేశారు
కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోవడంతో దేశంలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది డి.నరేంద్రరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కరోనా సమస్య తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు సూచనలు చేసేలా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌కు ఆదేశాలివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం సామాజిక దూరం పాటించాలన్న నిబంధనల మేరకు ఇప్పటికే న్యాయస్థానాలు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే అత్యవసర కేసులు విచారిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేశారని అన్నారు. ఎన్నికలను వాయిదా వేయకపోతే ప్రజల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించినట్లేనని ఆయన తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల శ్రేయస్సు కోసం స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించకూడదని ఆయన అన్నారు.