పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు సహా ముగ్గురి హతం

  • ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్
  • కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులు
  • తిప్పి కొట్టిన భద్రతా దళాలు
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు సహా వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అవంతిపొరలోని గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమైనట్టు, గాలింపు కొనసాగుతున్నట్టు చెప్పారు.


More Telugu News