కరోనా అప్ డేట్స్: ప్రపంచవ్యాప్తంగా లక్షా 90 వేలకు పైగా మరణాలు
- 26 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
- అమెరికాలో 49 వేలకు పైగా మరణాలు
- యూరప్ దేశాలు కరోనాతో కకావికలం
- విలవిల్లాడుతున్న ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్
ప్రపంచదేశాల్లో కరోనా రక్కసి కరాళ నృత్యం కొనసాగుతోంది. గత డిసెంబరులో చైనాలో ఈ మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకు 26, 98,733 మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడగా, 1,90,089 మంది మృత్యువాత పడ్డారు.
ఆసియాలో పుట్టిన ఈ వైరస్ భూతం అమెరికా తర్వాత యూరప్ దేశాలపై అధిక ప్రభావం చూపుతోంది. యూరప్ లో ఇప్పటివరకు కరోనాతో 1,16,221 మంది మరణించారు. అక్కడ 12,96,248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తీవ్రస్థాయిలో ప్రభావితమవుతున్న దేశం అంటే అమెరికానే. ఆ దేశంలో 49,963 మంది కరోనా ధాటికి బలయ్యారు. ఇక అమెరికా తర్వాత ఇటలీలో 25,549 మంది మరణించగా, స్పెయిన్ లో 22,157, ఫ్రాన్స్ లో 21,856, బ్రిటన్ లో 18,738 మంది కన్నుమూశారు.