లక్నోలో కనిపించిన నెలవంక... రేపటి నుంచి రంజాన్ మాసం షురూ

  • శనివారం 'రోజా' (ప్రార్థన)తో రంజాన్ నెల ఆరంభం
  • నిర్ధారించిన షియా, సున్నీ కమిటీలు
  • మే 25న రంజాన్ తో ఉపవాసాల ముగింపు
ముస్లింలకు పరమ పవిత్రమైన పండుగ రంజాన్. ముస్లింలు ఈ పండుగ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించి అల్లా పట్ల తమ విధేయతను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో, లక్నోలో ఈ సాయంత్రం నెలవంక కనిపించిందని, రేపటి నుంచి రంజాన్ మాసం షురూ అవుతుందని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. శనివారం నిర్వహించే 'రోజా' (ప్రత్యేక ప్రార్థన)తో రంజాన్ మాసం ఆరంభం అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని షియా, సున్నీ మూన్ కమిటీలు నిర్ధారించాయి.

ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఉపాధ్యక్షుడు, సీనియర్ మతగురువు మౌలానా కల్బే సాదిక్ ఈ విషయాన్ని గురువారమే ప్రకటించారు. అయితే ఆయన ఖగోళ అంశాల ఆధారంగా ఈ విషయం వెల్లడించారు. చివరికి నెలవంక కనిపించడంతో అధికారికంగా నిర్ధారణ అయింది. కాగా, ముస్లింలు తమ ఉపవాసాల పరంపరను మే 25న రంజాన్ తో ముగిస్తారు.


More Telugu News