ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: టీడీపీ నేత సోమిరెడ్డి
- ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామన్న హామీ ఏమైంది?
- పంట కొనుగోలు చేస్తామన్న హామీని అటకెక్కిస్తారా?
- రైతులకు ఏం చెప్పారో అది చేయండి
ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో రైతులకు బాకీ పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీ మొత్తం ఇచ్చేస్తున్నామని గత ఏడాది అసెంబ్లీలో ప్రకటించిన మాట ఏమైందని సీఎం జగన్ ని ప్రశ్నించారు. రైతులకు ఏం చెప్పారో అది చేయాలని డిమాండ్ చేశారు.
ఇన్ పుట్ సబ్సిడి హామీని పట్టించుకోని జగన్, రైతుల పంట కొనుగోలు చేస్తామంటూ ఇచ్చిన హామీని కూడా మాటలకే పరిమితం చేసేశారని విమర్శించారు. హార్టీ కల్చర్ రైతులు అన్యాయమై పోతున్నారని, వాళ్ల గురించి పట్టించుకునే నాథుడే లేరని ధ్వజమెత్తారు. ‘కరోనా’ కట్టడి విషయంలో గానీ, రైతుల విషయంలో గాని ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలనను జగన్ గాలికొదిలేశారని దుయ్యబట్టారు.