ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు ప్రశ్నలు అడగడం కామన్: హాస్యనటుడు బ్రహ్మానందం
- ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అనే ప్రశ్నలు కామన్
- షూటింగ్ లు ఉన్నప్పుడు, లాక్ డౌన్ అప్పుడు నేను ఒకే రకంగా ఉన్నా
- లాక్ డౌన్ తో నాకు ఏమీ తోచడం లేదన్న ‘ఫీలింగ్’ లేదు
‘కరోనా’ కట్టడి నిమిత్తం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సామాన్యుడి నుండి సెలెబ్రిటీల వరకు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందంను పలకరించిన మీడియాతో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అనే ఈ రెండు ప్రశ్నలు అడగడం ‘కామన్’ అని అన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో తాను ఏం చేస్తున్నారో కూడా వివరించారు. షూటింగ్ లు ఉన్నప్పుడు, లాక్ డౌన్ ఉన్నప్పుడు తాను ఒకే రకంగా ఉన్నానని, ఎందుకంటే, షూటింగ్ అయిపోతే ఇంటికి, ఇంట్లో పని అయిపోగానే షూటింగ్ కు వెళతానని, తనకు వేరే వ్యాపకాలు ఎక్కువగా ఉండవని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా తనకు ఏమీ తోచడం లేదన్న ఫీలింగ్ కలగకపోవడానికి కారణం తన లైఫ్ స్టైలే కావచ్చని అభిప్రాయపడ్డారు.