కరోనా ఔషధం విఫలం ప్రభావం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 535 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 159 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 9 శాతానికి పైగా నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బలహీనంగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, కరోనాను నియంత్రించే డ్రగ్ టెస్టులో విఫలమవడం మార్కెట్లపై నెగెటివ్ ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 535 పాయింట్లు పతనమై 31,327కి పడిపోయింది. నిఫ్టీ159 పాయింట్లు కోల్పోయి 9,154కి దిగజారింది. ఎనర్జీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.34%), సన్ ఫార్మా (1.67%), హీరో మోటో కార్ప్ (1.38%), ఎల్ అండ్ టీ (1.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.82%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-9.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.58%), యాక్సిస్ బ్యాంక్ (-5.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (-5.0%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-5.00%).