సోషల్ మీడియాకు నేను దూరంగా ఉండటానికి కారణం ఇదే: రాహుల్ ద్రావిడ్
- నేను టెక్నాలజీకి అలవాటు పడలేదు
- కొన్ని అంశాల గురించి ఆన్ లైన్లో చదువుతుంటాను
- క్రికెటర్లు గాడిలో పడటానికి సమయం పడుతుంది
తాను టెక్నాలజీకి అలవాటు పడలేదని, దాని అవసరం కూడా తనకు లేదని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ అన్నాడు. అందుకే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. తాను ఫోన్ ద్వారానే ఇతర వ్యక్తులతో చురుకుగా కమ్యూనికేట్ చేస్తుంటానని తెలిపాడు. కేవలం ఆసక్తికరమైన కథనాలు, కోచింగ్, ఫిట్ నెస్, మేనేజ్ మెంట్ కు సబంధించిన అంశాలను మాత్రమే తాను ఆన్ లైన్ చదువుతుంటానని... అంతకుమించి తాను ఇంటర్నెట్ ను వాడనని చెప్పాడు.
లాక్ డౌన్ పై ద్రావిడ్ స్పందిస్తూ, క్రికెటర్లు ఆటకు దూరంగా ఉండటం చాలా కష్టమని తెలిపాడు. వారు మళ్లీ గాడిలో పడటానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు.
లాక్ డౌన్ పై ద్రావిడ్ స్పందిస్తూ, క్రికెటర్లు ఆటకు దూరంగా ఉండటం చాలా కష్టమని తెలిపాడు. వారు మళ్లీ గాడిలో పడటానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు.