పారాసిటిమాల్‌తో కరోనాని ఎదుర్కొన్నందుకు డబ్ల్యూహెచ్‌వో సంభ్రమాశ్చర్యాలకు గురైంది: బుద్ధా వెంకన్న చురకలు
- విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందన
- బ్లీచింగ్‌తో కరోనాని చంపినందుకు దేశాల అధినేతలు ఆశ్చర్యపోతున్నారు
- స్కాట్లాండ్ యార్డు పోలీసులు, ఇంటర్ పోల్ కూడా వస్తోందట
- ఏపీలో కరోనా-వైఎస్ జగన్ నజరానా స్కీమ్
కొవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తోందని, ప్రతి రాష్ట్రం ఏపీని అసుసరిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటికే ప్రశంసించిందని, ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరా తీస్తోందని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ చురకలంటించారు.
'పారాసిటిమాల్‌తో కరోనాని ఎదుర్కొన్నందుకు డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సంభ్రమాశ్చర్యాలకు గురైంది. బ్లీచింగ్ తో కరోనా ని చంపినందుకు ఇతర దేశాల అధినేతలు ఆశ్చర్యపోతున్నారు. స్కాట్లాండ్ యార్డు పోలీసులు, ఇంటర్ పోల్ కూడా వస్తోందట' అని చురకలంటించారు.
'కరోనాతో ప్రపంచమంతా భయపడి చస్తుంటే... ఇంటింటికీ కరోనా-వైఎస్ జగన్ నజరానా స్కీమ్ ద్వారా ఎలా వ్యాప్తి చేశారో దర్యాప్తు చేస్తారట' అని ఎద్దేవా చేశారు.