నాందేడ్ లో చిక్కుకున్న 3 వేల మంది సిక్కులను స్వస్థలాలకు పంపించివేస్తున్న మహారాష్ట్ర!
- లాక్ డౌన్ కు ముందు నాందేడ్ గురుద్వారాకు వచ్చిన శిక్కులు
- 10 బస్సులను ఏర్పాటు చేసిన మహారాష్ట్ర
- హోమ్ శాఖ అనుమతితో వెనక్కు పంపుతున్న అధికారులు
లాక్ డౌన్ కు ముందు మహారాష్ట్రలోని నాందేడ్ లో ఉన్న గురుద్వారాకు వచ్చి అక్కడే చిక్కుబడిపోయిన పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన 3 వేల మంది సిక్కులను వెనక్కు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు నెల రోజులకు పైగా మహారాష్ట్రలో ఉండిపోయిన వారంతా, తమను ఎలాగైనా స్వస్థలాలకు చేర్చాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను వేడుకున్నారు. తాము ఇక్కడ ఉండలేకున్నామని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
దీంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మహారాష్ట్రను సంప్రదించాయి. తమ రాష్ట్ర వాసులను వెనక్కు పంపాలని కోరగా, కేంద్ర హోమ్ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఉద్దవ్ సర్కారు, గురువారం రాత్రి 10 బస్సులను ఏర్పాటు చేసి, 330 మందిని పంపించింది. మిగతా వారిని రెండు మూడు రోజుల్లో పంపిస్తామని స్పష్టం చేసింది.