మహేశ్ బాబుకి హెడ్ మసాజ్ చేసిన తనయ సితార!
- లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే టాలీవుడ్ ప్రిన్స్
- సరదాగా హెడ్ మసాజ్ చేసిన సితార
- డాడీ హెయిర్ చాలా మెత్తగా ఉందని కితాబు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకునే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై, ఖాళీగా ఉన్న వేళ, కుమార్తె సితారతో కాసేపు సరదాగా గడిపారు. మహేశ్ కూర్చుని ఉండగా, సితార వచ్చి హెడ్ మసాజ్ చేసింది. ఈ ఫొటోలను నమ్రత, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఓ వైపు గౌతమ్ గేమ్ ఆడుతుంటే, మహేశ్ కు హెడ్ వాలంటీర్ దొరికిందని, రెండంటే రెండు నిమిషాల్లో మసాజ్ పూర్తయిపోయిందని, బాగా చేసిందన్న ఫీడ్ బ్యాక్ కూడా వచ్చిందని తెలిపారు. ఇక సితార కూడా ఇవే ఫొటోలను షేర్ చేస్తూ, తాను చేసిన హెడ్ మసాజ్ నచ్చిందని నాన్న చెప్పడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొంది. డాడీ హెయిర్ చాలా మెత్తగా, మృదువుగా ఉందని కితాబిచ్చింది.