చిత్తూరు జిల్లాలో అందుకే కరోనా విజృంభిస్తోంది: బోండా ఉమ
- ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు
- శనగల పంపిణీలో కూడా అక్రమాలు జరిగాయి
- వైసీపీ నేతల తీరు వల్లే కరోనా విజృంభణ
- ఎమ్మెల్యే రోజా లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం సొంతంగా ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టలేదని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి ఇచ్చిన రూ.1000లో కూడా సగం కొట్టేశారని అన్నారు. శనగల పంపిణీలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పారు.
కార్మికులు, కూలీలు అందరూ ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతలు మాత్రం పబ్లిసిటీ పిచ్చితో తిరుగుతున్నారని, ప్రజలకి కరోనా సోకడానికి కారణమవుతున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి వీడియోలను తాము డీజీపీకి ఇచ్చామన్నారు. ఏపీలో ఒక్క రోజులో 80 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపారు. వైసీపీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టొద్దని ఆయన అన్నారు.
కేరళలో సమర్థవంతంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 13 రకాల నిత్యావసర సరుకులు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటింటికీ పంపారని తెలిపారు. ఏపీలో మాత్రం మాటలు తప్ప పనులు లేవని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే ర్యాలీ చేపట్టడంతో అక్కడ ప్రభుత్వ అధికారులకు కూడా కరోనా వచ్చిందన్నారు. ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పారు.
మన ముఖ్యమంత్రి తాడేపల్లిలో తన ఇంట్లోనే కూర్చుంటున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, ప్రధాని మోదీ నుంచి మేధావుల వరకు అందరితో మాట్లాడుతున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే రోజా లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. వైసీపీ నేతలకు చట్టాల మీద అవగాహన లేదని, ఇతర రాష్ట్రాల్లో ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడాలని చెప్పారు. పుచ్చిపోయిన కందులు వంటి సరుకులను అందిస్తున్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరు వల్లే చిత్తూరులో కరోనా విజృంభణ జరిగిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అన్నం దొరకక అల్లాడిపోతుంటే వైసీపీ నేతలు మాత్రం విందులు చేసుకుంటున్నారని బోండా ఉమ అన్నారు. నిత్యావసర సరుకులు కూడా వారికి అందట్లేదని చెప్పారు. ఇప్పటికైనా ఆడంబరాలు మానుకొని ప్రజల కోసం, కరోనా వ్యాప్తి కట్టడికి వైసీపీ నేతలు పనిచేయాలని ఆయన అన్నారు.
ప్రజలకు నిత్యావసరాలు అందించాలంటూ తాము అడుగుతుంటే తమ నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతోందని బోండా ఉమ ఆరోపించారు. ఆదిమూలపు సురేశ్ ఏపీ నుంచి హైదరాబాద్‌కు వారానికి నాలుగు సార్లు వెళ్లి వస్తున్నారని ఆయన ఆరోపించారు.
మంత్రులకు ఏపీ ప్రభుత్వం క్వారంటైన్ ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని దీక్షకు దిగితే కేసులు పెడుతున్నారని, వైసీపీ నేతలు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తోంటే మాత్రం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆయన నిలదీశారు. చట్టం ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.