'నీలాంబరి' తరహా పాత్రలో నయనతార

  • తెలుగు .. తమిళ భాషల్లో నయన్ కి క్రేజ్
  •  తాజాగా మలయాళ మూవీకి సైన్
  •  ప్రమోషన్స్ కి వస్తానని చెప్పిన నయన్
చాలా కాలం క్రితం రజనీకాంత్ చేసిన 'నరసింహా' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో 'నీలాంబరి'గా రమ్యకృష్ణ చేసిన పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగిన పాత్రగా మిగిలిపోయింది. ఆ తరహా పాత్రలో నయనతార కనిపించనుందని తెలుస్తోంది. తమిళంతో పాటు  తెలుగు ... మలయాళ సినిమాలతోను నయనతార బిజీగా వుంది.

రీసెంట్ గా ఆమె ఒక మలయాళ సినిమాకి సైన్ చేసిందట. ఈ సినిమాలో 'నీలాంబరి' తార పాత్రను చేయడానికి దర్శక నిర్మాతలు నయనతారను ఎంపిక చేసుకున్నారు. సొంత గడ్డపై సినిమా అనే సరికి నయనతార ఆ పాత్రను చేయడానికి వెంటనే అంగీకరించిందని అంటున్నారు. పారితోషికం విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోకపోగా, ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా వస్తానని చెప్పిందట.

సాధారణంగా నయనతార పారితోషికం విషయంలోను .. ప్రమోషన్స్ విషయంలోను చాలా నిక్కచ్చిగా ఉంటుంది. అలాంటిది ఆ రెండింటిని ఆమె పక్కన పెట్టేయడం హాట్ టాపిక్ గా మారింది.


More Telugu News