ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డికి హోం క్వారంటైన్.. నోటీసులిచ్చిన అధికారులు
- రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు విష్ణువర్ధన్‌రెడ్డి
- ఆయన ఇంటికి నోటీసులు అంటించిన అధికారులు
- బయటకు వెళ్తే కేసు పెడతామన్న పోలీసులు
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లొచ్చారంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు. నాలుగు వారాలపాటు ఆయన గృహ నిర్బంధంలోనే ఉండాలంటూ అధికారులు ఆయన ఇంటికి నోటీసు అంటించారు. నోటీసు ధిక్కరించి బయటకు వెళ్తే కేసు నమోదు చేస్తామని కదిరి సీఐ రామకృష్ణ తెలిపారు.
మరోవైపు, రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లొచ్చిన ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. కాగా, నోటీసు ఇచ్చేందుకు వెళ్తే విష్ణువర్ధన్ రెడ్డి లేరన్న సమాచారంతోనే ఆయన ఇంటికి నోటీసు అతికించాల్సి వచ్చిందని తహసీల్దార్ మారుతి పేర్కొన్నారు.