లాక్ డౌన్ ఎత్తివేతపై ఇప్పుడే చెప్పలేం: బీజేపీ జాతీయ నేత మురళీధరరావు

  • ఆ సమయానికి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం
  • మరో ఏడాది పాటు సభలు, సమావేశాలు డౌటే
  • నేడు సర్పంచ్ లతో, రేపు ఆర్థిక వేత్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
మే 3 తర్వాత లాక్‌ డౌన్‌ తొలగిస్తారో, లేదో ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదని, ఆ సమయానికి దేశంలోని కరోనా వ్యాప్తిని బట్టి తదుపరి నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు వ్యాఖ్యానించారు.

వర్చువల్ కాన్ఫరెన్స్ ప్లాట్ ఫాం ద్వారా తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైరస్ ను అణచివేసేందుకు రాష్ట్రాలన్నీ ఐకమత్యంతో పోరాటం కొనసాగిస్తున్నాయని, రాజకీయాలను పక్కనబెట్టి, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని అన్నారు. కనీసం మరో ఏడాది పాటు దేశంలో బహిరంగ సభలు, సమావేశాలు ఉండక పోవచ్చని అంచనా వేశారు. నేడు అన్ని గ్రామాల సర్పంచ్ లతోనూ, రేపు ఆర్థిక వేత్తలతోనూ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారని, 27న ముఖ్యమంత్రులతోనూ ఇదే తరహా సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.


More Telugu News