కరోనా రహిత రాష్ట్రాల్లో చేరిపోయిన త్రిపుర!

  • త్రిపురలో నమోదైన రెండు కేసులు
  • ఇద్దరికీ నెగటివ్ రావడంతో డిశ్చార్జ్
  • కేసులు లేని గోవా, మిజోరం, నాగాలాండ్, సిక్కిం తదితర ప్రాంతాలు
ఇండియాలో కరోనా మహమ్మారి వైరస్ ను తరిమికొట్టిన గోవా, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల సరసన త్రిపుర కూడా చేరిపోయింది. తమ రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా లేదని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ స్వయంగా ప్రకటించారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్రిపురలో కరోనా పాజిటివ్ వచ్చిన రెండో వ్యక్తి కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. వ్యాధి సోకిన తొలి వ్యక్తిని క్వారంటైన్ చేసి చికిత్స అందించామని గుర్తు చేసిన ఆయన, అతనికి ఇప్పుడు నెగటివ్ వచ్చిందని, ఆపై రెండో వ్యక్తి ఆరోగ్యం కూడా కుదుటపడి, నెగటివ్ వచ్చిందని అన్నారు. కాగా, కరోనా కేసులు ఒక్కటి కూడా లేని రాష్ట్రాల్లో సిక్కిం, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కూడా ఉన్నాయి.


More Telugu News