చలించిపోయిన తమిళ నటుడు విజయ్‌కాంత్.. కరోనా రోగుల ఖననానికి భూ దానం!

  • చెన్నైలో కరోనాతో చనిపోయిన వైద్యుడు
  • ఖననానికి అంగీకరించని జనం
  • అంబులెన్స్‌పై దాడి
కరోనా రోగుల ఖననం కోసం తమిళ సీనియర్ నటుడు విజయ్‌కాంత్ భూదానం చేశారు. కరోనా వైరస్‌తో చనిపోయిన వారిని ఖననం చేస్తే వైరస్ వ్యాప్తి చెందదని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఈ సందర్భంగా విజయ్‌కాంత్ కోరారు.

కరోనా బారినపడిన చెన్నై వైద్యుడు ఇటీవల మృతి చెందాడు. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు భౌతిక కాయాన్ని శ్మశానానికి తీసుకెళ్లగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు అడ్డుతగిలారు. అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని పట్టుబట్టారు. అక్కడ ఆయనను ఖననం చేస్తే కరోనా వైరస్ తమకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్‌పైనా దాడిచేశారు. దాంతో ఆ మృతదేహాన్ని మరోచోట రహస్యంగా ఖననం చేయడం జరిగింది.

ఈ విషయం తెలిసిన విజయ్‌కాంత్ చలించిపోయారు. చెన్నైలోని తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు. కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఆ స్థలాన్ని వాడుకోవచ్చని ఆయన ప్రకటించారు. 


More Telugu News