కరోనాపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి: అయ్యన్నపాత్రుడు
- ‘కరోనా’ కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
- జగన్ తన తీరు మార్చుకోవాలి
- పేదలకు సాయం చేయడంపై దృష్టి సారించాలి
‘కరోనా’ కేసులపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విపత్కర సమయంలో అసత్య ప్రచారాలు సరికాదని, ‘కరోనా’ కట్టడిపై శాస్త్రవేత్తలతో ప్రభుత్వం చర్చించాలని, రాజకీయాలపై కాకుండా పేదలకు సాయం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా ఉందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని, జగన్ తన తీరు మార్చుకోవాలని అన్నారు. ఇదే సమయంలో ట్రస్ట్ ల పేరుతో కొందరు వ్యక్తులు దాతల సాయాన్ని దోచుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.