లాక్ డౌన్ తర్వాత తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలి: ఏపీ సర్కారు ఆదేశాలు
- వచ్చే విద్యాసంవత్సరంపై దృష్టి సారించిన ఏపీ సర్కారు
- రెండు వాయిదాల్లో తొలి విడత ఫీజు
- ఫీజు చెల్లించలేదన్న కారణంతో ప్రవేశాలు నిరాకరించవద్దని స్పష్టీకరణ
లాక్ డౌన్ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంపై ఏపీ సర్కారు దృష్టి సారించింది. లాక్ డౌన్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. అది కూడా, తొలి విడత ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఏ విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదంటూ ఈ మేరకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.