లాక్ డౌన్ నుంచి పలు మినహాయింపులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  • నాన్ హాట్ స్పాట్ ప్రాంతాలకు కొన్ని మినహాయింపులు
  • స్టేషనరీ, ఎలక్ట్రానిక్, పిండిమిల్లులు, మొబైల్ రీచార్జి షాపులకు మినహాయింపు
  • ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ యూనిట్లకు మినహాయింపు
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం స్వల్ప ఊరటను కల్పించింది. నాన్ హాట్ స్పాట్ ప్రాంతాలకు కొన్ని మినహాయింపులను ప్రకటించింది. స్టేషనరీ, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపును ఇస్తున్నట్టు తెలిపింది. పిండి మిల్లులు, మొబైల్ రీచార్జ్ షాపులను లాక్ డౌన్ నుంచి మినహాయిస్తున్నామని చెప్పింది.

అలాగే, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సిమెంట్ యూనిట్లకు కూడా మినహాయింపును ఇస్తున్నట్టు తెలిపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్టిని సారిస్తున్నామని... పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించామని తెలిపింది. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలియా శ్రీవాస్తవ వెల్లడించారు. హాట్ స్పాట్ కేంద్రాల్లో మాత్రం మినహాయింపులు ఉండవని ఆమె స్పష్టం చేశారు. 


More Telugu News