మహిళలను ఆదుకుంటామంటూ సీఎం జగన్ మాయమాటలు చెబుతున్నారు: టీడీపీ నేత అనిత
- సున్న వడ్డీ పేరిట డ్వాక్రా మహిళలను మోసం చేస్తోంది
- వైసీపీ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగలడం ఖాయం
- లాక్ డౌన్ నిబంధనలను రోజా ఉల్లంఘించారు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ నేత అనిత విమర్శలు గుప్పించారు. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి కానీ, పనులు మాత్రం గడప దాటట్లేదు అన్న చందంగా ఈ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు.
ఎన్నికలకు ముందు మహిళలను ఆదుకుంటామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ మాటను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సున్న వడ్డీ పథకం పేరిట డ్వాక్రా మహిళలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగలడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆమె విమర్శలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఆమె ఉల్లంఘించారని అన్నారు.