వాహనచోదకులు హెల్మెట్, లైసెన్స్, ఆధార్ లేకుండా బయటకు రావొద్దు: సైబరాబాద్ సీపీ సజ్జనార్
- అత్తాపూర్ లో పర్యటించిన సజ్జనార్
- రోడ్లపై తిరుగుతున్న వాహనాల తనిఖీ
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాల సీజ్
నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం బయటకు వచ్చే వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఆధార్ కార్డు వారి వద్ద ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సజ్జనార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో ఇవాళ ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సజ్జనార్ మాట్లాడుతూ, ఎటువంటి కారణం లేకుండా, అనుమతి లేకుండా వాహనాలతో రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తం రోడ్లపైకి వచ్చే వారిని 3 కిలో మీటర్ల లోపే అనుమతిస్తామని చెప్పారు. పోలీసులు నిర్వహించే తనిఖీలకు వాహనదారులు సహకరించాలని కోరారు.