ఆడిషన్స్ కి పిలిచి.. దారుణంగా ప్రవర్తించాడు: నిర్మాతపై సినీ నటి మల్హార్ రాథోడ్ ఆరోపణ

  • సీరియల్స్ లో ఆఫర్ ఇస్తానని రూమ్ కి పిలిచాడు
  • టాప్ తీసేయమని బలవంతం చేశాడు
  • ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు
సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులపై జరుగుతున్న లైంగిక వేధింపులను 'మీటూ' ఉద్యమం చాలా వరకు బయట పెట్టిన సంగతి తెలిసిందే. తాము ఎదుర్కొన్న వేధింపులను ఎందరో నిర్భయంగా బయటపెట్టారు. తాజాగా బాలీవుడ్ కి చెందిన యువనటి మల్హార్ రాథోడ్ తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది.

'ఎనిమిదేళ్ల క్రితం ఇది జరిగింది. ఓ నిర్మాత అవకాశం ఇస్తానని చెప్పి ఆడిషన్స్ కు నన్ను తన రూమ్ కి పిలిచాడు. అక్కడకు వెళ్లిన తర్వాత టాప్ తీసేయ్... నేను చూడాలి అని బలవంతం చేశాడు. చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని వయసు 65 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నా' అని చెప్పింది.

ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఎంతో మనోవేదనకు గురయ్యానని మల్హార్ తెలిపింది. ఇలాంటి కామాంధులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని చెప్పింది. కుటుంబ పోషణకు తన సంపాదనే కీలకం అయినప్పటికీ... అవకాశాల కోసం అలాంటి పనులకు ఒప్పుకునే టైపు తాను కాదని తెలిపింది. ఏ రోజూ ఇలాంటి పనులు చేయలేదని చెప్పింది. అవసరమైతే వేరే కెరీర్ ఎంచుకుంటానని చెప్పింది.


More Telugu News