మహిళకు కరోనా సోకిందని కాలనీలో పుకార్లు.. వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించిన కుటుంబం
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఘటన
- ఇటీవలే తల్లిదండ్రుల వద్దకు వచ్చిన మహిళ
- అప్పటి నుంచి కాలనీ వాసుల సూటిపోటి మాటలు
- కాలనీ వాసులకు అవగాహన కల్పించిన పోలీసులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌కు చెందిన ఓ మహిళకు కాలనీ వాసుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. ఆమెకు కరోనా సోకిందంటూ కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. దీంతో కాలనీ వాసుల సూటిపోటి మాటలతో ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో బాధిత మహిళ ఉంటోన్న కాలనీకి చేరుకున్న పోలీసులు కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఇటువంటి వదంతులు సృష్టించి వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత మహిళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కరోనా కట్టడి ప్రాంతమైన అంబేద్కర్ నగర్ నుంచి ఇటీవల గుడిహత్నూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆమెకు ఈ వేధింపులు ఎదురయ్యాయి. ఆ మహిళ ప్రస్తుతం ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉంటోంది.