ఆ రోజు ఇదో పెద్ద స్కాం అన్నారు.. ఈ రోజు దానికే అనుమతిచ్చారు.. వారిని ఏమనాలి ?: జగన్‌పై లోకేశ్‌ ఫైర్

  • నదుల అనుసంధానాన్ని నిజం చేసి చూపించారు చంద్రబాబు
  • పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను కలిపారు
  • ఆ రోజు, ఇదో పెద్ద స్కాం అని, అంతా మాయ అని అన్నారు
  • ఇప్పుడు పేరు మార్చి అనుమతులు ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'దేశంలోనే కలగా మిగిలిపోయిన నదుల అనుసంధానాన్ని నిజం చేసి చూపించారు చంద్రబాబు. పట్టిసీమ ద్వారా గోదావరి - కృష్ణా నదులను కలిపారు. అదే స్ఫూర్తితో, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి, సాగర్ ఆయకట్టుకి నీరు ఇవ్వాలని, తలిచి పనులు ప్రారంభించారు.
 
ఆ రోజు, ఇదో పెద్ద స్కాం అని, అంతా మాయ అని, నీళ్లు రావు అంటూ, ఎగతాళి చేసింది వైసీపీ. అయితే, ఈ రోజు అదే ప్రాజెక్ట్, ఏదైతే మాయ అన్నారో, స్కాం అన్నారో, తన తండ్రి పేరుతో పేరు మార్చి, వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ పధకంగా పేరు మార్చి, అదే రూ.6020 కోట్లతో, అనుమతులు ఇచ్చారు.
 
ఇలాంటి వారిని ఏమనాలి ? ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పి, ఈ రోజు అదే ప్రాజెక్ట్, అదే డబ్బులతో అనుమతులు ఇచ్చి, జగన్‌ గారు తన తండ్రి పేరు పెట్టుకుని, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది నేటి రాజకీయం' అని విమర్శించారు.


More Telugu News