వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టిన రాహుల్ రవీంద్రన్
- నటుడిగా మంచి పేరు
- దర్శకత్వం పట్ల ఆసక్తి
- 'మన్మథుడు 2'తో పరాజయం
ఒక వైపున నటుడిగా కొనసాగుతూనే, మరో వైపున దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి రాహుల్ రవీంద్రన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్య నాగార్జున కథానాయకుడిగా ఆయన చేసిన 'మన్మథుడు 2' సినిమా పరాజయంపాలైంది. ఆ సినిమా నష్టాలనే కాదు .. ఆయనకి విమర్శలను కూడా తెచ్చిపెట్టింది.
ఆ డిప్రెషన్ నుంచి బయటపడిన ఆయన ఒక వైపున సినిమాలకి కథలను సిద్ధం చేసుకుంటూనే, మరో వైపున వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టాడు. వెబ్ సిరీస్ కోసం ఆయన ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. ఆయన చేస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సందీప్ కిషన్ ప్రధానమైన పాత్రను పోషించనుండగా, మరో ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్ చేయనున్నట్టు తెలుస్తోంది. వెబ్ సిరీస్ ల విషయంలో రాహుల్ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.