కరోనా వల్ల.. వందలాది కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన టీటీడీ
- తిరుమలపై కరోనా ప్రభావం
- ఇప్పటి వరకు రూ. 300 కోట్ల నష్టం
- టీటీడీ బడ్జెట్ అంచనాలు మారిపోయే పరిస్థితి
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల పవిత్ర స్థలాలపై తీవ్రంగా పడింది. తిరుమల, వాటికన్ సిటీ, మక్కా తదితర ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రాలు మూతపడ్డాయి.
ఈ నేపథ్యంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఏడుకొండలు బోసిపోయాయి. దీంతో టీటీడీ భారీ ఆదాయాన్ని కోల్పోయింది. టికెట్లు, హుండీ, వసతి గదులు, ప్రసాదం, తలనీలాలు, దుకాణాలు, హోటళ్లు తదితర రూపాల్లో వచ్చే ఆదాయం మొత్తం ఆగిపోయింది. మొత్తం రూ. 300 కోట్ల ఆదాయం కోల్పోయింది. కేవలం హుండీ ఆదాయమే రూ. 100 కోట్లకు పైగా నష్టపోయింది.
ఈ నేపథ్యంలో టీటీడీ 2020-21 వార్షిక బడ్జెట్ అంచనాలు మారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మే 3 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే టీటీడీ ఆదాయం భారీగా తగ్గిపోనుంది.