సీఎం జగన్ అందుబాటులో ఉండట్లేదు: కళా వెంకట్రావు
- ప్రజల్లో భరోసా నింపకుండా సీఎం ఇంటికే పరిమితమవుతున్నారు
- కరోనాపై చంద్రబాబు నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు
- న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా సీఎం తీరు మారలేదు
- కరోనా కట్టడి కంటే రాజకీయాలకే సీఎం ప్రాధాన్యతనిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీరు బాగోలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజల్లో ప్రభుత్వం భరోసా నింపాల్సి ఉంటుందని, ఇటువంటి పనులు చేయకుండా సీఎం జగన్ తన ఇంటికే పరిమితమవుతున్నారని చెప్పారు.
మరోవైపు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని కళా వెంకట్రావు చెప్పుకొచ్చారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
జగన్‌కు న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ ఆయన తీరు మారలేదని కళా వెంకట్రావు చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కంటే రాజకీయాలకే జగన్ ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సీఎం అందుబాటులో ఉండట్లేదని ఆయన విమర్శించారు.