మన ఓడలకు అడ్డంకులు సృష్టిస్తే కాల్చి పారేయండి: ట్రంప్ సంచలన ఆదేశాలు
- తమ ఓడలకు అడ్డుతగులుతోందంటూ ఇరాన్‌పై ఆగ్రహం
- అమెరికా హాలీవుడ్ కథలు చెబుతోందన్న ఇరాన్
- ట్రంప్ ట్వీట్‌తో కలకలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనమైంది. ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగిస్తున్న అమెరికా నావికాదళ నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) దాడులకు ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
తమ ఓడలకు అడ్డంకులు సృష్టిస్తే ఇరాన్ గన్‌బోట్లను కాల్చి పారేయాలని తమ నావికా దళానికి ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తర అరేబియా సముద్రంలోని ఐఆర్‌జీసీకి చెందిన 11 ఓడలు అమెరికా ఓడలకు పదేపదే అడ్డుతగులుతున్నాయని, ఓడలు పరస్పరం ఢీకొట్టకుండా అవసరమైన చర్యలు చేపడతామంటూ ఈ నెల 16న అమెరికా నేవీ ట్వీట్ చేసింది. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన ఇరాన్.. హాలీవుడ్ కథలు చెబుతోందంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.