నేను స్లీప్ పెరాలసిస్‌తో బాధపడ్డా: విక్కీ కౌశల్

  • ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం
  • అది భయంకరమైన అనుభవం  
  • తనకు దెయ్యాల సినిమాలు, కథలు అంటే భయమని వెల్లడి
‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’  చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ చాలా తక్కువ సమయంలోనే  స్టార్డమ్ తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో అతనిప్పుడు బిజీగా ఉన్నాడు. వెండితెరపై అతని జీవితం వేగంగా దూసుకెళ్తోంది. కానీ, వ్యక్తిగత జీవితంలో తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు విక్కీ తెలిపాడు. తాను  ‘స్లీప్ పెరాలసిస్’తో చాలా సార్లు బాధపడ్డానని చెప్పాడు.

 ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ‘మీరు నిజ జీవితంలో ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పాడు. తాను కొన్నిసార్లు ‘స్లీప్ పెరాలసిస్‌’ను ఎదుర్కొన్నానని, అది చాలా భయంకరంగా ఉందని అన్నాడు. ఇక, దెయ్యాలు అంటే భయమా? అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు తనకు దెయ్యం సినిమాలు అన్నా, కథలు అన్నా చాలా భయమని విక్కీ చెప్పాడు.

ఇక స్లీప్ పెరాలసిస్ అంటే.. ఒక్కోసారి నిద్రలోంచి హఠాత్తుగా మెలకువ వచ్చిన సమయంలో మనిషి స్పృహలో ఉంటాడు కానీ, అతని శరీరం మాత్రం కొన్ని క్షణాల పాటు అతని స్వాధీనంలో వుండదు. దాంతో అతనిలో చలనం వుండదు. అంతా తెలుస్తూనే వుంటుంది కానీ, నిద్రలోంచి లేవలేడు.  


More Telugu News