'ఇదిగో అన్నయ్యా' అంటూ.. ఎన్టీఆర్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన కొరటాల శివ!
- గిన్నెలు కడిగి, డైనింగ్ టేబుల్, ఇల్లు తుడిచిన దర్శకుడు
- మొదట్లో కష్టంగా ఉండేది, ఇప్పుడు సరదాగా ఉందని వెల్లడి
- విజయ్ దేవరకొండకు చాలెంజ్
లాక్డౌన్లో ఇంట్లో మహిళలకు సాయం చేయాలని చెబుతూ యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విసిరిన ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ టాలీవుడ్లో ట్రెండింగ్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఈ సవాల్ స్వీకరించిన దర్శకుడు కొరటాల శివ ఇంటి పనులు చేశారు.
వంట గదిలో గిన్నెలు కడిగారు. డైనింగ్ టేబుల్‌ను శుభ్రం చేశారు. ఆపై, ఇల్లు కూడా తుడిచి తన భార్యతో కలిసి ఫొటోకు పోజిచ్చారు. ఇదిగో అన్నయ్య (ఎన్టీఆర్) అంటూ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ‘మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా, రాను రాను అలవాటయ్యి, ఇప్పుడు సరదా అయింది’ అని ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు హీరో విజయ్ దేవరకొండను నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు.